శివరాత్రి

ఆరాటము


జాగులు, జోతలు, జపాలు
పూజలు, దీక్షలు, ఉపవాసాలు
పనులకు ప్రతిఫలము
సాన్నిధ్యమో? సాయుజ్యమో?

ఉచ్చాటనలతో ఉబ్బితబ్బిబ్బయి
ఉపవాసాలకు ఇక ఉండబట్టలేక
ఉన్నదంతా ఊడ్చిబెట్టుదువనే
మా పిల్ల చేష్టలను చూసి
మురుసుకుందువో? ముచ్చట పడెదవో?

ధ్యానం, యోగం, ఇంద్రియం
తర్కం, వాదం, శోధనం
ప్రయత్నమునకు ప్రయోజనము
అర్ధమో? అనర్ధమో?

సృష్టి అనే చిన్న రంధ్రము లోనుండి
ఆవలనున్న అనంతమును అవలోకించి
అద్దాని నుండి నిన్ను తెలుసుకోను మా యత్నమును
చిన్న పిల్లల ఆడించు కన్న తండ్రి వలె
ఊతమందీయ సమాధాన మందించెదవో?
పట్టుదలను పెంచ జవాబు ఆవలకు జరిపెదవో?

1 comment:

Unknown said...

Use this diet hack to drop 2 lb of fat in just 8 hours

Well over 160,000 women and men are trying a easy and SECRET "liquid hack" to drop 1-2 lbs every night as they sleep.

It's very simple and it works all the time.

Here's how you can do it yourself:

1) Take a glass and fill it with water half full

2) And now learn this awesome hack

and you'll become 1-2 lbs skinnier as soon as tomorrow!