దీపావళి


ధర్మ యుద్ధము


పాత్రలిందు ప్రాణప్రదుల జంపు
తల్లులే తనయుల నరకాలకంపు
బ్రహ్మ సైతము భేదించలేని మాయ ఇదయా
జగన్నాధు నడిపించు జగన్నాటక మాయ

ధరణి ధరియించె తాను సత్య రూపము
మగని కొంగున గట్టు ముగ్ధ రూపము
విభుని వెంట నడిచె తనూ రణ రంగమున
విభ్రమాకృతి గొనె నరకుడది కనుగొన

శర పరంపర నడిచె అసుర అరి నడుమ
తండ్రి బిడ్డల బంధమే అవ్వారి యెడమ
సుతుని గెల్వనిచ్చె ఆ తండ్రి ప్రేమ
శూలాన గాయపడె ఇది యేమి మహిమ?

సత్య చేతబూనె తన సఖుని ఆయుధమును
దైత్య సార్వభౌము చూసె చిన్న చూపామెను
అంత్య కాలమొచ్చె మునుముందుకు తోసిరాజను
అంత్య క్రియ యొనర్చె తల్లి బిడ్డకు ధర్మము నిలుపను

తొలగె నరక చెర భువికా చతుర్దశి
జరిపె పెద్ద పండగ మరు అమవసనిశి
లీలగాక మరేమి అనెరి జనావళి
లీలామానుషుని మహిమే ఈ దీపావళి

No comments: