దశ హర

The name Dus-hara (which eventually became Dasara) can signify slaying of 10, slaying by 10, or even slaying in 10. Though the term doesn't exactly make it clear the nature of the preposition, it feels apt though that the ambiguity is by design. According to the Puranas, it is the slaying by 10, where the Sakti assumes 10 avatars to finally prevail over a variety of demons tormenting the worlds. Enter the Treta Yuga, the term becomes slaying of 10, meaning the vanquishing of the 10 headed Ravana.

Even Ravana's 10 headed legend bears some scrutiny. Is that an actual physical trait that he had, an unsymmetrical row 10 heads (5 on one side and 4 on the other, with his main one at the center), or was it just a metaphorical embelishment? Once with 10 heads worth of knowledge by mastering the 4 Vedas and the 6 Shastras, he eventually let his 3 gunas rule over his 5 senses to drive both his heart (instincts) and mind (intellect) to the ground. It might be this symbolism that is celebrated every year in Ram Leela Maidan, bringing down the 10 headed figure, a shout out to the effect of the erring ways.





                                                                 దశ హర
అహము ఆలోచనకు అడ్డుపడితే
బలము బుద్ధికి మబ్బు కమ్మితే
కామము ఔచిత్యమును ఏమార్చితే
దర్పము నియతిని పరిమార్చితే
శ్వాస బుసగ మారి కోర్కె రంకె పెడుతుంది
తలకు కొమ్ములు పెరిగి మానుషము మహిషమవుతుంది

ఎరగడా ఈ విషయము దశకంఠుడు?
భక్తితో కదిలించి గరళకంఠుని
నిత్య వేదోఛ్ఛాటనముతో చతుర్ముఖుని
ఆత్మలింగమ్ము తెచ్చి కన్నతల్లిని
ప్రసన్ను చేసుకున్న పునీతుడతడు
చాతుర్వేదములను షట్ శాస్త్రములను
తలకెక్కించుక్కున్న పది తలలవాడు

తోబుట్టువు తలవంపులను తనదిగా తలంచి
ప్రతీకారము పేరిట పగను పెంచేసుకుని
పరాభవమునకు పాశవికత్వమే పరిహారమనుకొను
దురాలోచలనతో తలతొలిచేసుకున్న క్రమములో
గుణత్రయములకు పగ్గాలు అప్పగించి
పంచేంద్రియములను పరుగులు పెట్టించి
మనోబుద్ధులను భ్రష్టు పట్టించి
తుదకు తలను నేలను బడవేసుకొనె

సద్బుద్ధి మది నుండెనా
శరీరము పదితలల బరువైన మోయును
దుర్బుద్ధి మది నిండెనా
సమతుల్యము తప్పి మట్టికరవక మానదు
నిలువెత్తు బొమ్మలను యేటా నేలకూల్చే దశ హర సంబరము
తలబలుపుతనము యొక్క హెచ్చరిక తలపోసుకొను కారణము

1 comment:

Surya Kiran said...

Great Poem Sir, i have always like your lyrics but was not aware of this site , i came to know about it through Jeevi Garu. i guess i have lot of time and material here to catch up with.