శ్రీరామ నవమి

Love isn't singular but a composite emotion. If affection, care and concern can be considered as manifestations of love then their counterparts envy, malice and rage should equally be part of the same mix. It cannot be that this complex emotion is the sum of only the good parts. When a parent seethes in anger over his child's misdeeds and manhandles him, it cannot be but out of love. And so are the various passion crimes that one comes across in everyday life. At the root of it all is that ever pulsating entity - love.

The vital turns in Ramayana are borne out of the love of 2 ladies - Mandara, Soorphanaka. Unlike other stories, histories or mythologies, where the twists and turns arise out of conflicts of interests, Ramayana is all about love. Love of Mandara for her mistress convinced the latter into banishing Rama, love of Soorphanakha for Rama turned the entire course of the story.


అది యజమానురాలి యెడ ప్రేమా మందరను ప్రేరేపించినది?
సవతి చూలికి పట్టము గట్టుట చూడలేక
సొంత సంతుకు ఊడిగల ఉద్యోగమే రాసి ఉన్నదని
తన పర తేడాలెరుగని కైకమ్మను భయముపెట్టి
రామునకు తన రాజ్యముననే నిలువ నీడ లేక చేసినది?

అది సౌందర్యాతిశయమా శూర్ఫణఖను వివశను చేసినది?
చేరువ కాలేని అందమును చేజిక్కించుకొను ఆశతో
కాముకత్వమున వివేకమును విస్మరించిన కాంక్షలో
కృపతో చెప్పిన మాటలను పెడచెవిన పెట్టి
కృపాణపు మెరుపులకు ముక్కు చెవులు పోగొట్టుకున్నది?

కక్ష కార్పణ్యముల కారణన
మలుపు తిరిగిన కధలు ఎన్నో
మనిషి చరితన చిరపరచితం
ప్రేమ అతిశయించిన మాత్రాన
బహిష్కరణ తిరస్కరణలతో
రాతలే మారిన వైనం ఈ రామాయణం

హితము పేరిట మితులు మీరిన అభిమానమూ
కోరిక చాటున ఒడలు మరిచిన వ్యామోహమూ
పవిత్రమన్న ప్రేమకు ప్రతిరూపాలే
నిజాయితీకి నిలబడు నిదర్శనాలే

No comments: