దీపావళి



Physics confirms the dual nature of light - one as a particle, and the other, as a wave. And the same applies even to its philosophical nature. Light has a very interesting character, it exhausts itself to spread itself. A look to the sky, and there it is, the blazing sun, the eternal source of light (at least for the next few billions of years), constantly consuming itself through every moment of its existence, spreading light in brightest and harshest way possible. As night descends, the same source takes on a different delivery mechanism, one of beautiful and a benign nature. Lessons are many to derive of this, and to each, his own.

ద్వంద్వము



అదిగో... ఆ ఎదురుగా...
ప్రతి ఉదయమూ అభ్రపధమ్మును శుభ్రపరచుకొని
ప్రాభాత ముహూర్తమున అరుణ తిలకమును దిద్దుకొని
అనంతమాలపించు మౌన మంత్రోచ్ఛాటనల నడుమ
ఆత్మావాహన చేసికొనుచూ ఆ దినకరుడు
అనాది వేదికన ఆది కార్యమును ఆరంభించును

ఇదిగో... ఈ కుదురుగా...
తెప్పరిల్లిన నింగిన తెల్లని వెలుగుని నింపి
తేటపడిన బాటన తారల తోరణములు గట్టి
సోలిపోయిన జగతికి సాంత్వనమును చేకూర్చి
సదా సేద తీర్చ నెంచు ఆ సుధాకరుడు
సృష్టి సౌహార్ద్రతకు ప్రతిరూపము

అదిగో... ఆ మింట...
కణకణమూ కార్చిచ్చుల చితుకులు రగిలించుకొని
అణువణువూ అగ్నిహోత్రునకు ఆజ్యముగ అందించుకొని
ఆత్మసమర్పణతో అనంతమును అర్చించు
హోమవకిటిన కొలువుదీరిన ఆ నిత్య సోమయాజి
కర్మఫలము ప్రపంచమునకే పంచు త్యాగజీవి

ఇదిగో... ఈ వంక...
గుండె నిండు మంటను గుట్టుగా దాచుకొని
ఒంటినంటు వేడిని ఒంటిగా ఓర్చుకుని
సెగల రగులు తాపమను శీతలముగా మార్చి
ప్రపంచముపై ప్రసరించు ప్రసవశరుడు
చీకాకులను చిరునవ్వుల గెలుచు నిత్య పరవశుడు

ఒకరి గుండె మంట
ఒకరి మనసు వెన్న
ఒకరి వీక్షణ తీక్షణ
ఒకరి చూపు చల్లన
ఒకరి పలుకు కరకు
ఒకరి మాట మైమరపు
వెలుగున మను ద్వంద్వమునకు ప్రతీకలు
తల్లిదండ్రుల బాధ్యతలు నెరుపు సూర్యచంద్రులు

No comments: