శివరాత్రి



Devotion (bhakti) and knowledge (gnaanamu) are often considered as the prime routes to salvation. But what is devotion? Is it just an unwavering allegiance to a form or an idea, or is it more a means to an end, a way to achieve the recognition of one-ness with the world, where the devotee finds himself in everything, and everything in himself? So 'bhakti' in the purest form would lead to enlightenment, love, a realization, or in short, knowledge (gnaanamu). And what is knowledge? Where does the process of understanding more and more about the world, about oneself, lead to? The downside with approaching salvation (which is again a variant of understanding) strictly from knowledge perspective is the realization of its inherent limitation of how much the physical senses can make sense out of the creation. At some point, knowledge merges with faith to complement its understanding. Thus, both devotion and knowledge complete each other and one could not exist in substitution of the other, reflecting the 'adwaita' philosophy of one-ness.


అద్వైతము



జన్మ సంస్కారముతో అంకురించిన నమ్మకమే నారుగా
జగతి సావాసముతో వృద్ధిచెందిన విశ్వాసమే వేరుగా
ఇంద్రియములకు అందని అలౌకిక భావమునకు ఆలంబనగ
మనసు భావన చేసిన శాఖోపశాఖల విస్త్రుతి
కొమ్మ కొమ్మనా చిగురేసిన అరాధనా సుమమే భక్తి
నమ్మకముతో నాంది పలికి అరాధనతో ఎదిగిన భక్తి
విషయవాంచలుగ గాక విశ్వజనీన ప్రేమగా వికసించి
వివిధ రూపముల తత్వమున ఏకత్వమును గుర్తించి
తను పర నుండి వేరుకాని ఎరుకగా పెరిగి
మదిలోన వెలిగించు అఖండ అవగాహనా జ్యోతి

ప్రాపంచికమున పారదర్శకత వ్యాప్తి చేయు యత్నమునకు
సమాధానమునకు సంచరించెడు సందేహమే బీజము
విడివడని చిక్కులతో చీకాకు చెందక
వివరణల వెదుకులాటే వేడుకగా వర్తించి
జగతిని జాగృతమును జేయు జిజ్ఞాసే జ్ఞానము
తలపులను తొలుచుకుని సాగు శోధన
తేట పరచిన కొలదీ తరగని వేదన
మేధ పరిధి దాటి ఆవల నిలిచిన వాటిని
అవగాహనతో అందుకోను ఆరాటపడు ఆర్తి
తుదకు శోధనను విడిచి సాధనకు మరలి
ఊహకందని విస్త్రుతికి తలవంచుంటే భక్తి

భక్తి జ్ఞానమునకు ప్రేరకము
జ్ఞానము భక్తికి ప్రోత్సాహకము
తెలిసిపోయిన భావన భక్తికాగ
తెలిసికోవలెనన్న తపన జ్ఞానము
అనంతమను అర్ధము చేసికొను సాధనా క్రియలో
విషయమును విశదపరచు అభేదమే అద్వైతము

No comments: