దీపావళి


Leave the mythological aspects of the festival for a second here. Some customs seem strange on the face value. Why is that the rest of the festivals are celebrated during the day and only Deepavali during the night? If it was merely a celebration of the slaying of Narakasura, it could as well been be done during the day. Why was it that the darkest night of the season chosen for the occasion; and what could be the significance of the fireworks? Again, almost all the festivals are celebrated commemorating the felling of of one demon or the other, and why no fireworks for the rest and why only for Deepavali? It is here that it has to be believed (or can be proved categorically) that a deeper social relevance exists/created for all the types of customs and modes of celebrations that had been put in place for each festival, behooving future generations to find the(ir own) meanings and applications to the original intentions.


వెలుగు రేఖలు



వెలుగు కీర్తిని వేనోళ్ళ చాటుటకు
సర్వము తేటతెల్లము జేయు తెల్లవారులుండగ
కంటి చూపానని కటిక రాత్రిని ఎన్నుకున్నదెందుకో

ఏనాడో చదల వాడలో వెలిగించిపోయిన దీప శిఖ
సాధననావసరము లేని కాలగమనము చేత
విషయ మర్మములు విశదము చేయ
ప్రకృతి పేరిట ప్రతి పూట వేసిపోవును వెలుగు భిక్ష
నలు వైపులకు నలుపు రంగులద్దు కారు చీకట్లలో
చిరు దివ్వె అలుపు ఎరుగని ప్రయత్నమునకు ప్రతీక
చీకట్లపై పోరి సాధించుకున్న అఖండ శక్తి
అయాచితముగ దక్కగ అది ఇవ్వలేదు ఎటువంటి తృప్తి
చెమట చెమ్మ చలువ శ్రమయందే కలుగును
వేకువ వెలుగు విలువ చీకటిననే తెలియును

నాదామృతముతో జగతిని జాగృతముచేయటకు
చెవులు చవులూరు వేదమంత్రములుండగ
రణగొణ ధ్వనుల చిటపటల నెంచుకున్నదెందుకో

వేదమునకు నాదము ప్రధానము
నాదమునకు శబ్దము బీజము
శబ్దమునకు ధ్వని అంకురము
ధ్వనికి అలికిడి అవసరము
అలికిడికి కదలిక కారణభూతము
కదలికకు ప్రాణము ప్రామాణికము
ప్రాణమునకు చైతన్యము మూలస్థంబము
ఆ చైతన్యము మనుగడకు ఓంకారము
చితుకులందు చిందు చిటుకుచిటుకు లయలు
వేనవేల రాగాల కువకువల గీతికలు
కడలి హోరులో వినిపించు నిశ్చల తత్వాలు
గగన ఘోషలో రవళించు సృష్టి నిగూఢాలు
వివిధ ధ్వనుల సమ్మేళనమే నిగమాగమములకు భాష్యము
ఆ ధ్వనుల చైతన్యమే చిటపటల యందు చేయు ఆనంద తాండవము

No comments: