It is hard to believe that powerful weapons - Vishnu's Sudarsana, Siva'a trident, Indra's Vajrayudha etc - were what that separated the gods and the demons, handing victory to the former every single time. Divinity is more than that, and power should be more than the sum total of their arsenal. Navarathri serves as a perfect allegory of what defeated evil. Sure, the weapons helped, but the lethal combination of knowledge, devotion and persistence is what that ultimately paid off in the battle with animal instincts. Mythology or otherwise, the moral is unmistakable. And representing each branch of power, the holy trinity - Goddess Saraswati heading knowlege, Goddess Parvati accounting for persistence and Goddess Lakshmi representing devotion.
త్రిశక్తి
విచక్షణ వాగ్దేవి విపంచికా మూర్ఛనము
వివేచన వివిధ వేదరాసుల సమ్హితామృతము
సాలోచన ఆ యమ్మ భావనా వీచికల లహరి
సంభాషణ భూషిత హస్తము జాలువార్చు రసఝరి
సుజ్ఞానము ఇన మయూఖ తీక్షణా కటాక్ష వీక్షణ
సువిద్య బీజాక్షర మంత్రపూత పలుకుల సంప్రోక్షణ
జన్మ వేరు చేసినా జంగముని చేరు దీక్ష
కష్టతమమైననూ లెక్క చేయని కాంక్ష
బేసి కన్నుల మౌని తో తులతూగ ఈ బేల
పర్ణములను సైతము త్యజించిన వేళ
గరళ కంఠుని నోట గాంధారాలను పలికించి
ఊది పూతలలో పరిమళాలు పూయించి
మిన్నకున్న రాలలో రాగాలు శృతిచేసి
మోడువారిన గుండెలో చిగురుటాశలు రేపి
చిచ్చుకంటి వంటిలో వలపు మంట వెలిగించి
వసంతునికి తిరిగి ఉసురుపోసెను పార్వతి
పురుష సింగమును ప్రసన్ను చేసుకున్న చెంచులక్ష్మి ప్రీతి
కానరాకున్నా కూడరాదన్నా ధవుని చేరవలెనన్న వైదేహి ఆర్తి
వీలుకాదన్న వైరి తమకన్నా మాధవుని కోరుకున్న వైదర్భి భక్తి
అంశ వేరయినా గుర్తురాకున్నా వెంకడిని వెంటాడిన అలివేలు స్ఫూర్తి
వేల్పులకు సైతము తప్పని వియోగ బాధ
విడివడిన ప్రతి ఘటన అదొక ఆరాధనా గాధ
విధి వంచినా తల వంచని శక్తి
గతి మారినా వల్లమాలిన భక్తి
యుక్తి శక్తి భక్తులే పశు ప్రవృత్తికి నివృత్తి
మహిషత్వమును బాపి మానవత్వమును పెంచునీ జాగృతి
No comments:
Post a Comment