Sivaraatri




విరాగి


చేతనాచేతనల మాయా జగతికి మూలపురుషుడైన నీవు
కార్యాకారణముల కర్తృత్వ కర్తవ్యమును నెరిపేటి నీవు
సృష్టి తత్వమగు త్రికాల జ్ఞానమును తేటపరచుకున్న నీవు
ధ్యాన ముద్ర లోన మరి దేనిని తెలుసుకోగోరేవు పరేశా?
అస్థిత్వమునకే అతీతమైన నీకు తెలియనిది ఏది?
ఏ స్థాయిన ప్రాణమంతరించి పోయి భావమే మనునో
ఏ స్థితిన భగవంతమంతమై భక్తియే మిగులునో
ఏ భౄమధ్యమున జ్ఞానజ్యోతి అఖండమై వెలుగునో
ఆ అలౌకికమును అర్ధ నిమీలితనమున దర్శింతువా నిటాలాక్షా

కన్న బిడ్డల మురిపెమును తీర్చు పిచ్చి తండ్రి వలె
వేడిన తడవునే కొంగు బంగారమై నిలుచు వరదాయీ
జీర్ణ వస్త్రమును దాల్చి కపాల పాత్రను పట్టి
భిక్షుక భూష లోన దేనినాశించేవు సదా శివా?
కాంక్షను కార్చిచ్చున రగిల్చిన నీకు కావల్సినది ఏది?
ఏ విభూతి లేపనముతో వాసనల తడి దరి చేరదో
ఏ అర్ధాన్వేషణమున సత్యావిష్కారమున కాస్కారముండునో
ఏ క్రియావిశేషమున తామసాహములు పారద్రోలబడునో
ఆ తిరుపరి వేషమున కామ్యరాహిత్యమును కోరుకుందువా కపర్దీ

నిర్వికల్ప యోగము నీ యోచనా బలము
నిస్సంగత్వ గుణము నీ యాచనా ఫలము

1 comment:

maruthi said...

Loved the bhaava!!