కేశ విలాపము
నేనొక క్షురకశాల లోనికి జని కురిచీన జారగిలబడి
జుత్తునందీయనంతలోన కురులన్నియు జాలిగ నోళ్ళువిప్పి
మా ప్రాణము తీతువామంచు బావురుమన్నవి కృంగిపోతి
నా తలపండునందేదో తళుకుమన్నది పుషవిలాపమునకు పేరడియై
పుట్టినాట నుండి
దువ్వెన వలలతో వేటాడి
కత్తెర మొనలతో హింసించి
సంస్కార క్రియల అంతమొందిచ జూతువే
మేము నీకు ఏమి అపకారము జేసితిమోయీ
పురిటిలో నవమాసాలు నిండకనే
పుట్టువెంట్రుకల వేడుక జేసి
బోసి గుండుపై అలరారు బాల వెంట్రుకలను
నలుగురిలోన నిర్లజ్జగా నిర్జించి
భ్రూణ హత్యకు ఓడిగడితివో తలారీ
ఆత్మీయతన అల్లుకున్న
మా తోబుట్టువుల పొదరిళ్ళను
చిక్కు ముళ్ళ పేరిట
చిందర వందర జేసి
మా భగ్న హృదయాల మీద
నీ భస్మ సింహాసనము
నిలుపుకొను నిర్దాక్షిణ్య చక్రవర్తీ
మా మూగ బాధ నీకు వినిపించదే
చమురు కాసరములో ఎదురీది
కుంకుళ్ళ కార్పణ్యమునకు ఎదురొడ్డి
సాంబ్రాణి పొగమంటలో మసిబారి
కడకు రిబ్బన్ల ఉరుల మా తలలు సోలిపోయె
పారాడు వయసు నుండి ఈ క్రౌర్యమునకు మారాడక
మీ చెరలో అనుభవించు నరక బాధల నుండి
ఈ జన్మకు మాకు విముక్తి లేదే
వింత రీతులోయీ మీ మనుజులది
మీ సౌందర్యమునుకు పాటుపడు
మా సహృదయతను కాదనుకుని
ఉన్న దానిని జారవిడుచుకొను
చింత జీవులు మీరు
ఉన్నది పుష్టి మానవులకన్న
కృష్ణ మూర్తి సూక్తి వినలేదుటోయీ
ఉంగరములు తిరిగి మీ వన్నెకు నగిషీలు దిద్దువారము
ముంగురులుగ రేగి మీ కంటికి అహ్లాదమందించెదము మేము
రింగులగ మారి నటభూషులకు శొభనిత్తుము
చెంగుమంటు ఉరికి మీ జడపాయలకు నడకలు నేర్పెదము
స్వేచ్చ మతులము మేము తాళుము తెగనరుకబోకుము
మొట్టికాయల నొప్పి బొప్పి కలిగించకుండా
కొమ్ము కాచునది మేము
కొలిమి ఎండ వేడి గుండును మాడనివ్వకుండా
అడ్డు పడునది మేము
సర్వాకాల సర్వావస్థలలో మీ తలనంటి ఉండు
సుందర శిరస్త్రాణములు మేము
సహజ శిరోభూషణములము మేము
వయసు జోరులో మీ కౌమార కళలు చాటి
మింట జయ కేతనమును ఎగురవేయు మేము
ముదిమి మీద పడినంతనే వివేకమునెంచి
ధవళ వల్కలము గట్టి మీ వెంటే సాధుచిత్తులగుదుము
మా ఆయువు తీరినంతనే మీకు ఇక భారవమక
నిశ్శబ్దములో నేల రాలిపోవుదుము
ఓయీ మానవుడా!
సత్యసాయి భూమిలోన పుట్టినావు
కురులపై కరుణ నీలోన చచ్చినేమి
మా కుత్తుకలుత్తరించు హంతకుండా
మైలపడి పోయెనోయి నీ మనుజ జన్మ
అలా... ఆ విధముగా...
కురుల క్షోభను విన్న నాకు మనసు రాక
డబ్బు క్షురకు జేతిలో పెట్టి వికలమనస్కుడనై
దుబ్బు జుత్తుతో మరలిపోయిన నా అమంగలమును గాంచి
ఇల్లాలు వడ్డించి వెళ్ళిన ముక్కు చీవాటలకు తలవాచి
తిరిగి క్షురకశాలలో చేరి తలను వంచిన నా అశక్తతను మన్నించి
మరు జన్మకు పుట్టు ఖర్వాటు రూపము ప్రసాదించు ప్రభూ....
8 comments:
I read all your posts in idlebrain. They were great.
read my post http://musicandmyth.blogspot.com/2009/03/wwwidlebraincom.html
please check bhavakavita.blogspot.com
srinivas garu...... too good and it reminded me of puspa vilapam
sir.....ee kasha vilapamu.....kesha vinnapamu la thosthu..maa mansulanu dosthunnadi....
Are they pajjalu or padyalu?
Srinivas garu .. chala chakkaga rasaru, kadupubba navvincharu :D .. idlebrain dwarana ippude mee blog darshanam aindi :)
srinivas garu,
mee kesavilapamu chala bavundi, chala navvu teppincharu....kaani illali cheevatlu..meeru akharaku tala vanchi 'kshawara kalyana mahotsavam' jaripinchadam...alarinchindi.
Excellent...Superb...Outstanding..
Post a Comment