Yugaadi

The phrase 'warrior poet' isn't a silly concoction of mismatched/misplaced functions. After all, how can one be involved in a bloody act and then be poetic about it? The term however rises about the seemingly earthly duties of waging wars. It is about understanding the nature of change and necessitating it through knowledge. A war is never about the winning. It is about changing the status quo. It is this change that the sweet lark portends and brings it about with its war cry on time. It is the bearer of good news and the harbinger of a better tomorrow.

వసంత కోకిల

ముసురేసిన శిశిరములో రాజ్యమేలు నిశ్శబ్దమును
చిగురేసిన వసంతములో పనిగట్టుకుని పారద్రోలు
సద్దుమణిగిన గాలితో స్థబ్దమైన ప్రకృతికి
ఉత్తేజము నందిచ తన గొంతునూతము సేయు
చేతనమును కట్టివేసిన కాలపు నిరంకుశమును
దిక్కులను కూడగట్టి ఎలుగెత్తి ఎదురించు
సమరము సమసి వెల్లివిరియు విజయమును
వరసలు గట్టి వేనోళ్ళ కీర్తించు
ఓయని పిలిచే ఆమని పలకరింపును
ఓహోయని బదులిచ్చు ఆత్మీయతకు ఆనవాలు

ఇంత స్ఫూర్తినందించు ఆ చైతన్య మూర్తి ఎవరనిన...

పిడికెడంత తనువులో పిసరంత ప్రాణమున్న
కురచ కాయమును కప్పిపుచ్చుకోను
చిటారు కొమ్మల చిగురుటాకుల
చీర చెరగుల చాటు చూసుకొను
సిగ్గు మొగ్గలు వేసిన వింత విరిబోణి

లేత మామిడి పూతల వగరు రుచులు గొని
తీయ తేనియలూర మధుర బాణీలు కూర్చి
సుగంధాల గ్రంధాల భావాలు జతజేసి
పుప్పొళ్ళ పల్లకిలో పిల్ల గాలుల బోయీలతో
నవవసంత సందేశము నలువైపులా చాటు
అవనిపై వెలసిన ఆకాశవాణి

కుహు కుహూల జంట స్వరాలతో
రస తరంగాలలో ఊయలూగించు
సహజముగ అబ్బిన సంగీత ఙ్ఞానమునుతో
క్రమము తప్పక కాల ఙ్ఞానమును బోధించు
ఋతు శోభల సాంప్రదాయ కృతులతో
ప్రకృతి వేదికపై అనాది రాగము ఆలపించు
వీనులకు విందుచేయు సొంపైన సంగతులతో
వసంతుని స్వర బహుపరాక్కుల స్వాగతించు
వింత ధ్వనులు పొదువుకున్న చిన్న స్వర పేటికతో
పిట్ట కొంచెము కూత ఘనమన్న కీర్తి గడించు

2 comments:

Kanth Jonnalagadda said...

ayyaa sahanaamadheya - Reading your poetic lines on every festival day has become a routine for me. Good job and thank you very much. --srinivas/kanth (bandar)

Srinivas Kanchibhotla said...

Hi Srinivas, this is a pleasant surprise. Has been a long while since we talked last. Hope all is well on your end. It is interesting we keep bumping into each other in all these different virtual/cyber spaces - email, blogs, (and probably standing next in line , twitters and social networking sites). don't know if technology is pre-ordained to facilitate this (aah! heights of self importance :-) ) or we are playing good catchup.