The cosmic dance of Nataraja signifies the life cycle - creation, sustenance and destruction. The Dhamaru in the right hand reflecting the beat of the heart, the dancing feet trampling the dwarf (Apasmara), the march of life crushing down ignorance/indifference and the fire in his left hand, the destructive force (which of course, clears the platform for rebirth/rejuvenation). While the traditional view of the duties from creation to cremation involve Brahma, Vishnu and Maheswara, the concept of Nataraja is an embodiment of all the above in one unifying model.
నాట్యరాజు
శ్వాసకు ఆశ్వాసనమునందించు
ఉఛ్ఛ్వాస నిశ్వాసల నిశ్శబ్దములో
ప్రాణమునకు ప్రామాణమై నిలిచిన
గుప్పెడు గుండె గుట్టుచప్పుళ్ళలో
అంతరంగాల తరంగాల
ఆటుపోటుల నిబద్దతలో
సదా ప్రతిధ్వనించును ప్రణవ నాదము
ఢమరులయల మార్మ్రోగిన జీవన వేదము
స్థబ్దమును స్ఫూర్థితో మేల్కొలిపి
ఊహలలకు ఆలోచనల అందెలు తొడిగి
బ్రతుకునాట నర్తనకు ఉపక్రమించె
చేతనమునకు ప్రతిరూపమైన పాదము
కామితపు కొలిమిలో రగిలి
ఆవేశపు బుసలను విడిచి
అఙ్ఞానమును కాలరాయు లక్ష్యమున కదిలె
చైతన్యమునకు ప్రతీకయైన నాట్యము
ప్రతి గమ్యము క్రొత్త గమనానికి మార్గదర్శకము
ప్రతి అంతము నూతన ఆరంభమనకు నాందీవాక్యము
ఊపిరిని ఇంధనము చేసి
జఠరము రగిలించు అగ్ని
ఆయువు తీరినంతనలోన
కళేబరమునకు సాక్షియై నిల్చు
నిత్యాగ్నిహోత్రముల హోమవేదికపై పరివేష్టితుడు
అరచేత చింతనిప్పులు ధరించిన అనంతలయుడు
విశ్వమును వేదిక జేసి
కాలముతో తాళమును వేసి
ప్రాణమును లయలో నిలిపి
యోగమును ముద్రలలో జూపి
విశృంఖలముగ నర్తించు నటరాజ రూపము
సృష్టి స్థితి లయలు మూర్ర్తీభవించిన త్రిమూర్తి తత్వము
4 comments:
Srinivas garu,
meeru US settled ani telustondi. Telugu Literature ante interest? or did you do any M.A in Telugu? Ivi mee poems chadivaka adagaalanipinchindi.
Anyway, do you take any conscious steps towards God by trying to practise one of the methods prescribed by Lord Krishna in the Gita? Idi meeru raasina Thyaagayya ramblings chadivi adugutunnanu.
Or, knowledge telusukuni vadileyyadaanika?
Suppose, if I assume that you whole heartedly believe in the teachings of the Lord, are you making a conscious effort of reminding yourself of his existence at every moment of your life?
Finally, what I am getting to:
Is that(making the effort I mentioned above) in your hands or is it dictated by Praarabdha karma?
If you believe in the concept of karma, will you explain it to me?
Sivudi order lekapothey cheema kuda kuttadu antaaru kada.
Alaantappudu manamu chestunna prati pani divine sankalpama leka manamu sontamuga cheyagaligindi unda?
meeku teerika kudirinappudu answer cheppandi.
Chaitanya
Chaitanya gaaru, your questions aren't that simple to be answered in just a few lines of reply. I would like to dedicate an entire post with my understanding of these age old concepts soon. And no, I don't have an M.A. in telugu :-). I am just a dabbler in the language.
Eagerly awaiting your post.
Thanks for replying Srinivas garu.
Srinivas garu,
I am just 22. Address me as Chaitanya.
Post a Comment