Sankranti

భోగి మంటలు
పొద్దు పొడిచే వేళకై ఘడియలు లెక్కపెట్టుకుంటూ
చేయవలసిన చేష్టలను తిరిగి నెమరువేసుకుంటూ
కలల బేహారి నిద్రను దరి చేరనివ్వక
అసహనమున పడక మీద పొర్లాడు కుర్రకారుకు
తొలి కోడి క్రీన్కారమే మంగళ సుస్వర సుప్రభాతము
గాలి పాటల గాలి పటాల కోతల కేరింతలలో
కోడిపున్జుల కోసు పందేల తుళ్ళింతలతో
ఉరకలేయు ఉత్సాహములో ఎగసిపడె
శిధిల గతాల చిచ్చులలో భోగి మంటలు
రేపటి బాటపై క్రీనీడలు పోద్రోలు కాంతి రేఖలు

పరువపు పరవడిలో అందగించిన అందమంతా
పొంగు కొంగు చుట్టున బిగియజుట్టి
మది నిండి పొరలు చిరునవ్వుల తెరలను
ముని పంటి మాటున నొక్కిపెట్టి
ముంగిట వేసిన ముగ్గులలో రేపటి కలలు దిద్దుకుంటూ
చెక్కిట అంటిన రంగులలో ఎర్రటి సిగ్గులు చెరుపుకుంటూ
మరు ఏటికి మరుని మగని కమ్మని
కోరు కన్నె బంగారుల గొబ్బి పాటలలో
ఆశలు ఆజ్యము చేసి వెలిగించిన భోగి మంటలు
రేపటి కళ్యాణ వేదికకు తరలివచ్చు అగ్నిసాక్షులు

అందిన చోట నోటి మాటతో అందని చోట నోటు రాతతో
అరువుల ఎరువులు తెచ్చి చేబదుల చేనులో చల్లి
ఏపుగా పెంచుకున్న పంట
చేతికి అందివచ్చు ఆఖరి నిముషాన
రుణ రాబందుల మంద కసిగా కాపుగాసి
ఇంటికి గింజనైనా చేరనివ్వక
పంట నోట కరచుకుపోయిన చేదు నిజము
గొంతుకు మింగుడు పడక కంటికి కునుకు రానీయక
కడుపులో పేర్చి పోయిన చింతల చింత నిప్పులు ఈ భోగిమంటలు
మారని తలరాతల గీతలు ఏటా చెప్పు కడగండ్ల కధలు ఈ సంక్రాంతి సద్దులు

(ప్రేరణ: శ్రీశ్రీ గారి "సంధ్యా సమస్యలు")



3 comments:

rgvFreak said...

hello sir
I am a great fan of ur writings
they have reality and life in them
I wanna know more about you sir.

Ram said...

enti andi...new year resolution aa...blog rayadam resume cheyali ani...

Anonymous said...

Don't write for the sake of writing, i saw your comment on 3 idiots and i am 100% positive you didn't understand the point of the movie. I am not talking because its a major hit even if it was flop, your comments simply suck.

A writer who cannot express his/her idea in a simple language is pretty useless. I definitely appreciate your effort on using some classic english but i am sure you know what "malapropism" means and your article has plenty of them.

Once again "Don't write for the sake of writing"