దేశమంటే...
నీలాల నింగిని అందుకొను ఆశతో
పాతిన దిమ్మలో దింపిన కర్ర ఊతతో
మువ్వన్నెల జెండా మింటికెగయు నిమిషములో...
స్వతంత్రము 'స్వ' తోనే మొదలనీ
స్వేచ్చలో 'స్వ' లాభమే మెండనీ
స్వార్ధముతో 'స్వ' కృత్యములలో తరించు తరానికి...
తోటి వాడి కోసము తమను త్యాగము చేసుకున్న
వీరధనుల స్ఫూర్తిని ఒక్క మారు స్మరించుకుందాము
చూపు పక్క వాడి వైపు పాకగానె
వేష భాష భూషలను బట్టి
వేరు తరగతిగా విభజించుకొనెడి కుంచిత మనసుకు...
భిన్న భాగాల సమాహారమే శరీరమనీ
ఏది మొరాయించినా అడుగు ముందుకెయలేమనీ
దేని పరమార్ధమూ ప్రాముఖ్యతా దానికున్నదనీ...
ఏకత్వము కానరాని ఐదు వేళ్ళతో ఆవిష్కరించిన జెండాకు
చప్పట్లు కొట్టే చేతులను చూసి గుర్తుచేసుకుందాము
జంతువుల కిచ్చిన విలువ సాటి మనిషికివ్వక
చిహ్నాలకిచ్చిన గౌరవము చెంతనున్న వాడికి చేరనీయక
ఆపదలో ఉన్న వాడికి ఆపన్న హస్తము అందీయక...
ఆవును అంతమొందించ పూనుకున్నాడనీ
జాతీయ గీతాన్ని సుస్వరముతో ఆలపించలేదనీ
వేరు ప్రాంతాలనించి ఉద్యోగాలు కాజేయ వలస వచ్చాడనీ...
వైరుద్ధ్యాల వంక చూపి వైషమ్యాలను వెదజల్లే
వేర్పాటువాదపు విష కోరలు మనమే పెకలించుకుందాము
పండగ పూట కొత్త బట్టలు కట్టుకుని
బూజుబట్టిన భావలను మాత్రము పదిలముగా దాపెట్టుకుని
నలుగురితో పాటు నేటి గురించి వందిగా వల్లించు భారతీయునికి...
స్వరాజ్యమంటే ఇష్టారజ్యమని
నా దేశమంటే నాదే దేశమని
నా దారి కాక ఇక గతి గోదారే నని...
దేశమంటే మట్టిగానే పరిగణించే పిచ్చి మూఢ భక్తుడా
నీ దేశ భక్తి గీతము అమ్మను తిట్టకురా లంజకొడకా వంటి కీర్తి గానమేరా!
No comments:
Post a Comment