ఉప-ని-షత్



ఆశయము:

లోకరీతులలో నీతులను చొప్పించు బృహత్కార్యము
ఆదర్శాలను ఆచరణలో చూపించు మహదవకాశము
పఠణ మంత్రమున ప్రాణకోటిని తరింపజేయు తరుణోపాయము
శ్రవణ మాత్రమున శ్రోతలను రంజింపజేయు సలక్షణ కావ్యము
దేవుని మాటను నరుని నోటన పలికించు గురుతర బాధ్యత
తరములు మరినా పసిడిలా వసివాడ కూడని యోగ్యత
బాహ్య విఙ్ఞానమును విపులీకరించు చాతుర్వేదములు ఒక ఎత్తు
అంతః సంక్లిష్టతను విశ్లేషించు ఈ పంచమ వేదము మరొక ఎత్తు

ఆచరణ:

కుదురు తెలియని బాల్యమును కట్టడి చేసి
గురువు చూపిన బాటన నిలకడను నేర్చి
విద్యను అర్ధించు ఆసనమున ఉపవిష్టుడాయె
వేదముల సారంశమును లిఖించ విఘ్నేశ్వరుడు
సురలోకము నుండి దుమికిన గాంగఝరిని తలపించెను
ద్వైపాయనుని నోటివెంట వెలువడిన శ్లోక స్రవంతి
దివిజ ధాటిని కపర్ది నిలువరించిన విధము నవలంబించెను
వైశంపాయనుని వాగ్ధాటికి వరుసలు గట్టి వినాయకుడు
భూమిని సుభిక్షము చేయు భగీరథుని భక్తి మూర్తీభవించెను
సాహితీ సస్యమును పరిపుష్టి చేయు పసుపతి సుతుని లగ్నమందు
మానవ నైజమునకు నిలువుటద్దమును నిలబెట్టిన దార్శనికులు
నరనారాయణులను పదములన ఆవిష్కరించిన హరిహర అంశలు

No comments: