శివరాత్రి


వెదుకులాట


విశ్వాంతరాళమున వెదజల్లిన విస్త్రుతికి విస్మయము చెందనా?
అణుమాత్రమున అణిచిపెట్టిన సంక్లిష్టతకు అబ్బుర పడనా?
అందినట్టే ఉన్న లీలకు తలను వంచనా?
అర్ధమే అవని లెక్కలకు తికమకలు పడనా?
నీవే అన్నింటనన్న గుడ్డి భక్తిని నమ్ముకోనా?
ఏదీ ఇదికాదన్న తిక్క తర్కాన తెలుసుకోనా?
గతము నడచిపోయిన బాటన నిను ఆరాధించినా?
ప్రశ్నలు పరచుకున్న మార్గాన అన్వేషించనా?
అనుభూతితో నిను అందుకోనా?
అవగాహనతో నిను తెలుసుకోనా?
నీవు భవునివా? లేక భావానివా?

నిన్ను చూచు కాంక్ష తీవ్రతమమైనా
ఎన్నడూ నువ్వు నాకు కనిపించబోకు
నిన్ను తెలుసుకోను నిత్యమూ నీ ఊసునెంచినా
ఎన్నటికీ నువ్వు నాకు అర్ధమే కాబోకు
అవధి లేనటువంటి ఆలోచనకు అవకాశమును కల్పించి
పరిమితులకందని పరమార్ధముందన్న పరిణితిని పుట్టించి
సదా నీకోసము నా శోధనను సాగనివ్వు
సమాధానమందని సాధనకు సూత్రమవ్వు
అనుభూతిలోని ఆర్తితో అవగాహనన వెలుగు జ్యోతిలో
అస్తిత్వము మనని తీరములో అందుకోనీ నిన్ను
నీవు అనంతుడవు, నీవు అనర్ధుడవు

1 comment:

Chaitanya said...

anardhudavu ante ardham kaani vaadivana? naaku chadavagaane anardham gurtuku vachindi.
meeru inka ila manchi posts raayalani aasistunnanu.