శ్రీ రామ నవమి

వన వాసంకోమల కరములపై కంకణములై అమరె కనకాంబరములు
ఎండకు ఎరుపుదేలిన వంటికి చలువ చేర్చు చెలులుగా
కురుల కొలనులో కలువలై విరిసె తెల్ల మల్లెలు
నింగి చెక్కిళ్ళపై తళుకుమను వేగుచుక్కూలుగా
మిసిమి మెడను వదలకుండగ పట్టె పొగడ దండలు
తల్లి ఒడిని వడిసిపట్టుకున్న ముద్దు పాపలుగా
చెవి చాటున దాగె సిగ్గు మొగ్గల సంపెంగలు
చిటారు కొమ్మన కలకల్ములు చేయు కోకిలమ్మలుగా
విరులే భూషణములై విరి తావులే వాని జిలుగులయి
పచ్చని ప్రకృతి నడుమ పర్ణశాలన వెలసె వసంత లక్ష్మి
తన తల్లిచే తొలిసారిగా సింగారింపబడిన సీతా మాలక్ష్మి

నాడు అసుర సంహారమున మెరుపు మెరికైన కోదండము
నేడు పూలు పండ్లు తెంచు పొడుగు కర్రగ మిగిలె
నాడు యాగ రక్షణలో కండ దిరిగిన బాహువులు
నేడు విరుల సం రక్షణలో నునుపు దేలె
నాడు కదనమున పావులను కదప నేర్చిన యుద్ధ తంత్రము
నేడు నీటి బాటను పాదుల వెంట నడప ఉపయుక్తమాయె
నాడు వీరతనుమ సాధించి తెచ్చిన విజయ సిరి
నేడు తన సతి అలకల గెలుపుల ముందు వెలవెలబోయె
విల్లంబులను సారించిన చేతులతో విరిబూతలను సవరించి
ప్రకృతి పరిరక్షణలో వ్యస్థుడాయె వసంత రాయుడు
తన అత్తగారి ఆతిధ్యమును తొలిసారిగా అందుకున్న అయోధ్యా రాముడు

1 comment:

Anita Eradla said...

Mr. Kanchibhotla,
I totally agree with you on your ramblings on Teenmaar.
They had so much potential but they wasted it by making it into something so dead and idiotic. They were aware that audience will flock to theater becoz of Pawan Kalyan so it does't matter if they work on the script at all. I regretted paying for a movie in a long time. Love Aak Kal is a classic and jayanth made it into (How to not spoil a classic in the form of Teen Maar). Where were Pawan kalyan's gery cell?