వినాయక చవితి

నివేదన


చిన్ననాటి అక్షరాభ్యాసము మొదలు
ఉన్నత విద్యాభ్యాసముల వరకు
వయసుకు మించిన బరువులు తలకెత్తుకున్న మొదలు
పుస్తకమును హస్తభూషణముగా నిలుపు వరకు
పాఠ్య గ్రంధాలను పసుపు విజ్ఞాపనలు చేసి
నీ కృపకై క్రమము తప్పక వచ్చు కాళ్ళ బేరమ్మిది
సందేహాల సాగరాల ఆవల గల సాఫల్య ఫల మందుకోను
చేయు ఎదురీతలో ఎదురౌ బాలారిష్టాల బారి నుండి
చేయూత నందించమని చేతులెత్తి మ్రొక్కేము

అడ్డాల నాట తడబడు నడకల నుండి
గడ్డాల నాటి ఒడిదుడుకుల నడతల వరకు
సాగు పధములన్నిటా విఘ్నములను తొలగించి
వేయు ప్రతి పదములో వెన్నoటి నిలిచినందుకు
కూడ వచ్చిన బదులు గుంజిళ్ళతో తీర్చేము
లేత వయసుల తేట మనసుల మొదలు
చింత వయసుల చీకాకు మనసుల వరకు
ఎదురదెబ్బలతో తలబొప్పి కట్టకుండని
బుద్ధినందివమ్మని బుద్ధి బుద్ధీ యనుచు
మొట్టికాయల ఫలహారములు ప్రేమతో పెట్టేము

బ్రతుకు నాట సాగు బాటలలో
పూల పరిమళాలతో పాటు గడ్డి గరగరల ఊసు
నీ పాదముల పత్రి సమర్పించుచూ
మరవక మా మనమున మననము చేసుకునేము
పసందు విందులకు స్థోమత లేని స్థితిన
క్ష్యములలో భేషజములకు తావీయక
రాలను హరించుకొని సరిపెట్టుకొను స్ఫూర్తి
ఉండరాలను నీ చేత ఉంచి నేర్చుకునేము

విమల చిత్తమున సరళ చింతనము సాగు నీ రీతి
అందిచమను మా వినతి ఈ చవితిన అందుకోమా గణపతి

1 comment:

Poorna V said...

Hi Mr. Srinivas,

I always had the same complaint with you as the other readers of Idlebrain.com that your articles and your way of writing is too complex and i don't understand what you are trying to tell after one or two paragraphs. I sent you some mails also previously. Can't you simplify your english. I am thinking your are raising some sensible points which we would understand if you write them in simplified way.